Vijayasai Reddy: టీడీపీ నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవు: విజ‌య‌సాయిరెడ్డి

vijaya sai slams chandra babu
  • విజయవాడలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
  • చంద్రబాబు బానిస పార్టీల నేతలెవరూ నోరు మెదపడం లేదు
  • పసి పిల్లపై లైంగిక వేధింపులన్న విజ‌య‌సాయిరెడ్డి
విజయవాడలో తొమ్మిదో తరగతి చదువుతోన్న బాలిక ఆత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆమె ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను ఆ పార్టీ ఇప్ప‌టికే సస్పెండ్ చేసింది. మరోపక్క టీడీపీ నేత‌ల‌పై వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో, బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.  

'చంద్రబాబు ఉస్కో అనగానే స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసే బానిస పార్టీల నేతలెవరూ 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదు. పసి పిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పశువు టీడీపీ నేత వినోద్ జైన్ ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవు' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
YSRCP
Telugudesam

More Telugu News