హాలీవుడ్ స్టార్ కు తనను తాను పరిచయం చేసుకున్న సల్మాన్ ఖాన్... వీడియో ఇదిగో!
- బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సల్మాన్
- సౌదీ అరేబియాలో అవార్డుల కార్యక్రమం
- సల్మాన్ కు ఆహ్వానం
- ఇదే కార్యక్రమానికి విచ్చేసిన జాన్ ట్రవోల్టా
అది ఓ ప్రభుత్వ అవార్డుల కార్యక్రమం. ఈ వేడుకకు హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా కూడా వచ్చాడు. బ్రోకెన్ యారో, పల్ప్ ఫిక్ష్, ఫేస్ ఆఫ్, బాటిల్ ఫీల్డ్ ఎర్త్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కాగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన సల్మాన్, ట్రవోల్టా ముందువరుసలో పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ తనను తాను పరిచయం చేసుకుని, గతంలో పలు చిత్రాల్లో ట్రవోల్టా నటనను కొనియాడారు. అందుకు ట్రవోల్టా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.