Nagachaitanya: 'మానాడు' దర్శకుడితో చైతూ!

Nagachaitanya in Venkat Prabhu movie
  • వరుస హిట్లతో ఉన్న చైతూ
  • ముగింపుదశలో 'థ్యాంక్యూ'
  • వెంకట్ ప్రభు కథకు గ్రీన్ సిగ్నల్
  • లైన్లో పరశురామ్, విజయ్ కనకమేడల
నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో .. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. 'మజిలీ' .. 'లవ్ స్టోరీ' సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఆయన, రీసెంట్ గా 'బంగార్రాజు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'థ్యాంక్యూ' ముగింపు దశకు చేరుకుంది.

ఇక తాజాగా ఆయన దర్శకుడు వెంకట్ ప్రభుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇటీవల 'మానాడు' సినిమాతో వెంకట్ ప్రభు హిట్ కొట్టాడు. ఈ సినిమాను ఇప్పుడు సురేశ్ ప్రొడక్షన్స్ వారు రీమేక్ చేస్తున్నారు. ఆయన ఇటీవల చైతూను కలిసి కథ చెప్పడం .. చైతూ ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు.

ఇక చైతూతో సినిమాలు చేయడానికి పరశురామ్ .. విజయ్ కనకమేడల .. నందిని రెడ్డి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ పరశురామ్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాడు. మరి ఈ ప్రాజెక్టులలో ఎవరితో ముందుగా ఆయన సెట్స్ పైకి వెళతాడనేది చూడాలి. ఇక చైతూ వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Nagachaitanya
Venkat Prabhu
Maanadu Movie

More Telugu News