Tollywood: ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి నెట్టింట్లోకి అడుగుపెట్టారా?.. ఆమె పేరిట వైరల్​ అకౌంట్​!

A Twitter Account Viral In The Name Of Jr NTR Wife Laxmi Pranathi
  • లవబుల్ హస్బండ్ అంటూ ఎన్టీఆర్ తో ఉన్న ఫొటో పోస్ట్
  • తాజాగా రాజమౌళి ఫ్యామిలీతో ఉన్న ఫొటో షేర్
  • ఖుషీ అవుతున్న కొందరు అభిమానులు
  • ఫేక్ అకౌంట్ అని కొట్టిపారేస్తున్న మరికొందరు
టాలీవుడ్ హీరోల శ్రీమతులంతా దాదాపు సోషల్ మీడియాలో ఉన్నారు. మహేశ్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇదేకోవలో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా నెట్టింట్లోకి వచ్చినట్టు ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.

నిజమో కాదో తెలియదు గానీ.. లక్ష్మీప్రణతి పేరిట ఓ ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయింది. ‘లక్ష్మీఎన్టీఆర్’ అనే యూజర్ ఐడీతో నాలుగు రోజుల కిందటే అకౌంట్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. ఆ ఖాతాలో ఎన్టీఆర్ తో లక్ష్మీప్రణతి కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ‘‘ట్విట్టర్ లో మీ అందరితో కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా ప్రియమైన భర్త ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను ఫస్ట్ పోస్టుగా పెడుతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా నిన్న త్రోబ్యాక్ పిక్ అంటూ రాజమౌళి ఫ్యామిలీతో ఉన్న ఫొటోను ఖాతాలో పోస్టు చేశారు.

అయితే, ఆమె సోషల్ మీడియాలోకి వచ్చారంటూ కొందరు అభిమానులు ఖుషీ అవుతుంటే.. మరికొందరు మాత్రం అది ఫేక్ అకౌంట్ అని వాదిస్తున్నారు. మరి, ఆ అకౌంట్ నిజమైనదో..కాదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. మరోవైపు వివాహం జరిగినప్పటి నుంచి లక్ష్మీప్రణతి ఒకటీరెండు సార్లు తప్ప పబ్లిక్ గా కనిపించింది లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ టచ్ లో లేరు.
Tollywood
Laxmi Pranathi
Jr NTR
Twitter

More Telugu News