YSRCP: దర్గా పునర్నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇచ్చిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు

YSRCP MLA Rachamallu Siva Prasad Reddy donate one crore to dargah
  • హజరత్ సయ్యద్‌షా హుసేన్‌వలి సాహెబ్ దర్గా నిర్మాణానికి భూమి పూజ
  • ఏమిచ్చినా ముస్లింల రుణం తీర్చుకోలేనన్న ఎమ్మెల్యే
  • రూ. 30 లక్షల నగదు, రూ. 70 లక్షల చెక్ అందజేత
దర్గా పునర్నిర్మాణానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హజరత్ సయ్యద్‌షా హుసేన్‌వలి సాహెబ్ దర్గా‌ను పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిన్న ముస్లిం మతపెద్దలతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి దర్గా నిర్మాణానికి తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా అంజుమన్ అహ్లె ఇస్లాం కమిటీకి రూ. 30 లక్షల నగదు, రూ. 70 లక్షల చెక్కును అందించారు. ముస్లింలు అంటే తనకెంతో ఇష్టమని, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
YSRCP
Rachamallu Siva Prasad Reddy
Dargah
Proddatur

More Telugu News