Chiranjeevi: చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్

KCR speaks to Chiranjeevi by phone
  • కరోనా బారిన పడిన చిరంజీవి
  • హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న మెగాస్టార్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవిని ఫోన్ ద్వారా కేసీఆర్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం చిరంజీవి హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకిందని నిన్న ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానని చెప్పారు. మరోవైపు హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడ్డారు.
Chiranjeevi
Tollywood
Corona Virus
KCR
TRS

More Telugu News