Kanipakam: కాణిపాకం ఆలయంలో దారుణం.. పాత రథచక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు!

Chariot wheels burnt by unknown in Kanipakam
  • గోశాల పక్కన నిల్వ ఉంచిన రథ చక్రాలు
  • నిప్పు పెట్టడంతో బూడిదగా మారిన వైనం  
  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భక్తులు

ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో కలకలం రేగింది. వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ రథ చక్రాలను గోశాల పక్కన నిల్వ ఉంచారు.

ఈ ఘటనలో రథ చక్రాలు పూర్తిగా కాలిపోయి, బూడిదగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News