puradeswari: ప్రజాభీష్టం ఈనాటికి నెరవేరింది.. 'ఎన్టీఆర్ జిల్లా' ఏర్పాటుపై దగ్గుబాటి పురందేశ్వ‌రి

puradeshwari on ntr district
  • విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా 
  • స్వాగ‌తించిన‌ పురందేశ్వ‌రి
  • జై ఎన్టీఆర్ అంటూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవ‌ల‌ కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాకు 'ఎన్టీఆర్ జిల్లా'గా నామకరణం చేయడంపై టీడీపీ నేత‌లు, నంద‌మూరి వారసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ స్పందించలేదు.

ఈ క్రమంలో తాజాగా, ఎన్టీఆర్ తనయ, బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రి మాత్రం స్పందించారు. ''ఆ మహనీయుడు నందమూరి తారకరామారావు గారు పుట్టిన జిల్లాకు 'ఎన్టీఆర్‌ జిల్లా' అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా స్వాగతిస్తున్నాను. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరింది. జై ఎన్టీఆర్'' అంటూ ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.
puradeswari
BJP
Andhra Pradesh

More Telugu News