Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల!

Tirumala online tickets for February month to release tomorrow
  • రోజుకు 12 వేల ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల
  • 29న సర్వదర్శనం టోకెన్ల విడుదల
  • రోజుకు 10 వేల చొప్పున అందుబాటులో సర్వదర్శనం టికెట్లు
ఫిబ్రవరి నెలకు గాను తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లను రేపు ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేస్తోంది. రేపు (28వ తేదీ) ఉదయం 9 గంటలకు స్పెషల్ ఎంట్రీ టికెట్లను విడుదల చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. రోజుకు 12 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇక ఈనెల 29న సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టోకెట్లు ఆన్ లైన్ లో లభ్యం కానున్నాయి.

ఫిబ్రవరి నెలలో ప్రత్యేక దర్శనం టికెట్లను పెంచాలని భావించినప్పటికీ... కరోనా వ్యాప్తి నేపథ్యంలో టికెట్లను పెంచలేదని అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 27,446 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 13,403 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.77 కోట్లు వచ్చింది.
Tirumala
TTD
Special Entry Tickets
Sarva Darshanam Tockens

More Telugu News