డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
- నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ కంట్రోల్ సెల్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశం
- ఈ విభాగంలో పని చేయనున్న వెయ్యి మంది పోలీసులు
- డీజీపీ ఆధ్వర్యంలో పని చేయనున్న ప్రత్యేక విభాగం
ఈ ప్రత్యేక విభాగం డీజీపీ ఆధ్వర్యంలో పని చేయనుంది. డ్రగ్స్ ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ఈ విభాగం విధులను నిర్వర్తించనుంది. మరోవైపు డ్రగ్స్ ను నియంత్రించేందుకు, కఠిన చర్యలను చేపట్టేందుకు ఈనెల 28న 'స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్' జరపాలని నిర్ణయించారు.