Bheemla Naik: ఫిబ్రవరి 24న 'భీమ్లానాయక్' ఓవర్సీస్ ప్రీమియర్ షోలు

Bheemla Naik premier shows on February twenty fourth
  • పవన్ కల్యాణ్ హీరోగా భీమ్లానాయక్
  • ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ రిలీజ్
  • ఒకరోజు ముందు అమెరికా, కెనడాల్లో ప్రీమియర్ షోలు
  • భీమ్లానాయక్ పై భారీ అంచనాలు
పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకున్న భీమ్లానాయక్ చిత్రం ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో, ఫిబ్రవరి 24న అమెరికా, కెనడా దేశాల్లో భీమ్లానాయక్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అమెరికా, కెనడాల్లో ఈ చిత్రాన్ని ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లానాయక్ చిత్రం వాస్తవానికి సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా, పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రానా శక్తిమంతమైన ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, పవన్ కు జంటగా నిత్యా మీనన్ నటించింది. భీమ్లానాయక్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం.
Bheemla Naik
Premier Shows
USA
Canada
Pawan Kalyan

More Telugu News