Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్

Police arrests TDP leader Budda Venkanna
  • మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు
  • బుద్ధాను విజయవాడ వన్ టౌన్ స్టేషన్ కు తరలింపు
  • బుద్ధా నివాసం వద్ద ఉద్రిక్తత

టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బుద్ధా వెంకన్నను పోలీసులు విజయవాడ వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు. ఈ సాయంత్రం బుద్ధా నివాసానికి పోలీసులు రావడంతో టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. అయినప్పటికీ పోలీసులు బుద్ధాను అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బుద్ధాపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ సందర్భంగా బుద్ధా వెంకన్న డీజీపీపై మండిపడ్డారు. డీజీపీ తీరు చూస్తుంటే జగన్ పార్టీకి డైరెక్టర్ లా ఉందని విమర్శించారు.

  • Loading...

More Telugu News