Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కరోనా పాజిటివ్
- భారత్ లో కరోనా దూకుడు
- లక్షల్లో రోజువారీ కేసులు
- తనకు కరోనా సోకిందన్న శరద్ పవార్
- ఆందోళన చెందనక్కర్లేదని వెల్లడి
దేశంలో కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. రాజకీయ రంగంలోనూ కరోనా వ్యాప్తి అధికమైంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా కొవిడ్ బారినపడ్డారు. కొవిడ్ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకిన విషయాన్ని శరద్ పవార్ స్వయంగా వెల్లడించారు.
అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. డాక్టర్లు సూచించిన మేరకు చికిత్స పొందుతున్నానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శరద్ పవార్ సూచించారు.