అనిరుధ్ పాడిన 'పటాస్ పిల్లా' సాంగ్ రిలీజ్!
- రొమాంటిక్ లవ్ స్టోరీగా 'డీజే టిల్లు
- హీరోగా సిద్ధు జొన్నలగడ్డ
- హీరోయిన్ గా నేహా శెట్టి పరిచయం
- సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
లవ్ .. రొమాన్స్ ను ప్రధానంగా చేసుకుని సాగే పాట ఇది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, సంగీత దర్శకుడు అనిరుధ్ ఆలపించాడు. సంగీత సాహిత్యాలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. రొమాంటిక్ సీన్స్ కూడా రొటీన్ గానే కనిపిస్తాయి.
'ఆరెంజ్' .. 'గుంటూరు టాకీస్' .. 'కల్కి' సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించిన సిద్ధు, ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా మార్కులు కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. బ్రహ్మాజీ .. ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.