Shraddha Kapoor: పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కోసం పెళ్లి పెద్దగా మారిన 'సాహో' భామ

Shraddha Kapoor turns wedding officiator for her make up artist
  • ప్రియుడ్ని పెళ్లాడిన మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ 
  • పెళ్లి నాటి ప్రమాణాలు చదివించిన శ్రద్ధా కపూర్
  • సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపిన నాయక్
ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. సెలబ్రిటీ ఇంట పుట్టినా ఎంతో సింపుల్ గా ఉంటుంది. ఆమె తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ లో పేరున్న నటుడు. అయినప్పటికీ స్వంతగా ఎదిగి తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది.

కాగా, తన స్నేహితురాలు, మేకప్ ఆర్టిస్ట్ అయిన శ్రద్ధా నాయక్ కోసం శ్రద్ధా కపూర్ పెళ్లి పెద్దగా మారింది. శ్రద్ధా నాయక్ తన ప్రియుడ్ని పెళ్లాడింది. ఈ పెళ్లిలో వధూవరులతో పెళ్లినాటి ప్రమాణాలు చదివించే బాధ్యతను శ్రద్ధా కపూర్ అందుకుంది. దాంతో శ్రద్ధా నాయక్ ఆనందం అంతాఇంతా కాదు. స్టార్ హీరోయిన్ అయ్యుండి స్నేహం కోసం పెళ్లిపెద్దగా మారిన ఆమె మంచి మనసును కొనియాడుతూ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.
Shraddha Kapoor
Shraddha Naik
Wedding
Officiator
Saaho
Tollywood
Bollywood

More Telugu News