BCCI: వెస్టిండీస్ తో వన్డేలు, టీ20లకు వేదికలు మార్చిన బీసీసీఐ

BCCI changes venues for matches with West Indies

  • భారత్ లో కరోనా వ్యాప్తి
  • ఫిబ్రవరిలో టీమిండియా-వెస్టిండీస్ మధ్య వన్డేలు, టీ20లు
  • వన్డే మ్యాచ్ లన్నీ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహణ
  • టీ20 సిరీస్ కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం

ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్ జట్టు టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే భారత్ లో కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ల వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది.

మూడు వన్డేలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయని, మూడు టీ20 మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతాయని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

BCCI
Venues
West Indies
Team India
ODI
T20
Corona Virus
Pandemic
  • Loading...

More Telugu News