EC: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ర్యాలీలు, రోడ్ షోలపై ఈ నెల 31 వరకు నిషేధం పొడిగింపు

EC extends ban on rallies and road shows in poll bound five states
  • ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
  • ఏడు దశల్లో పోలింగ్
  • ఈ నెల 31 వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం
  • మొదటి, రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సడలింపు
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.

అయితే, తొలిదశలో ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఈ నెల 28 తర్వాత ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలకు అనుమతి ఇచ్చింది. రెండో దశ ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి సభలు నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది. ఇంటింటి ప్రచారానికి ఇప్పటివరకు గరిష్ఠంగా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా, ఇప్పుడా సంఖ్యను 10కి పెంచింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వీడియో ప్రచార రథాలను రంగంలోకి దింపుకోవచ్చని పేర్కొంది.
EC
Ban
Rallies
Road Shows
Five States
Assembly Elections

More Telugu News