Kodali Nani: కొడాలి నానీ ఇది మీకు కనిపిస్తోందా?... పెట్రోల్ రెడీగా ఉంది!: కాసినో వీడియో పోస్టు చేసిన టీడీపీ నేతలు

TDP leaders questions minister Kodali Nani over Casino issue
  • గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ ఆరోపణలు
  • తప్పు నిరూపిస్తే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానన్న కొడాలి నాని
  • వీడియోలు పోస్టు చేసిన టీడీపీ
ఏసెస్ క్యాసినో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని గడ్డం గ్యాంగ్ గుడివాడలో క్యాసినో నిర్వహించిందని టీడీపీ ఆరోపించింది.  దానికి సాక్ష్యం ఆ కంపెనీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోనే అని స్పష్టం చేసింది. తప్పు చేశానని నిరూపిస్తే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని ప్రకటన చేయడంపై టీడీపీ స్పందిస్తూ.... పెట్రోల్ రెడీగా ఉంది, నువ్వెక్కడున్నావు? అంటూ ప్రశ్నించింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఈ మేరకు కొన్ని వీడియో లింకులు పంచుకుంది.

ఈ వీడియోలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ వీడియోపై ఇప్పుడు మీరేం సమాధానం చెబుతారు కొడాలి నాని గారూ అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. గుడివాడలో గడ్డం గ్యాంగ్ కొడాలి నానీ... ఇది మీకు కనిపిస్తోందా? అని వర్ల రామయ్య నిలదీశారు.
Kodali Nani
Casino
Gudivada
TDP Leaders
Andhra Pradesh

More Telugu News