Perni Nani: జగన్, చిరంజీవి కుశల ప్రశ్నలు వేసుకున్నారు: పేర్ని నాని

Jagan Chiranjeevi meeting is a common meeting says Perni Nani
  • ఇటీవల జగన్ ను కలిసిన చిరంజీవి
  • సినీ రంగ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారన్న చిరు
  • చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు మాత్రమేనన్న పేర్ని నాని
సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య అగాధాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన ఆయన సీఎం కుటుంబంతో కలిసి భోజనం చేశారు.

అనంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ, సినీ రంగ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం త్వరలోనే తీసుకుంటారని తెలిపారు. జగన్ ఇచ్చిన భరోసాతో తనలో ధైర్యం వచ్చిందని చెప్పారు. ఎవరూ అభద్రతాభావానికి గురి కావద్దని, అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

చిరంజీవితో జరిగినవి కేవలం సంప్రదింపులు మాత్రమేనని పేర్ని నాని అన్నారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారని చెప్పారు. వారిద్దరు మాట్లాడుకున్న విషయాలన్నీ తమకు చెప్పలేదని అన్నారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
Perni Nani
Jagan
YSRCP
Chiranjeevi
Tollywood

More Telugu News