Priyanka Chopra: అభిమానులకు తీపి కబురు చెప్పిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మ!

Priyanka Chopra and Nick Jonas welcome baby via surrogate
  • తమకు బిడ్డ పుట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • చెప్పలేనంత సంతోషంగా ఉందన్న ప్రియాంక
  • ఈ ప్రత్యేక సమయంలో ప్రైవసీకి భంగం కలిగించొద్దని ప్రేమపూర్వక వేడుకోలు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ దంపతులు అభిమానులకు స్వీట్ న్యూస్ చెప్పారు. సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చామంటూ గత రాత్రి సోషల్ మీడియా ద్వారా వీరు వెల్లడించారు. 2018లో ప్రియాంక, జొనాస్ వివాహం జరిగింది. వీరికి ఇదే తొలి సంతానం. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తీపి కబురు చెప్పిన ప్రియాంక దంపతులు.. బిడ్డకు జన్మనిచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కుటుంబంపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని, ఈ ప్రత్యేక సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని ప్రేమపూర్వక విజ్ఞప్తి చేశారు.

ఇటీవలే 39వ పడిలో పడిన ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  పిల్లలు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పిల్లలు తమ జీవితంలో పెద్ద భాగం అవుతారని అన్నారు. దేవుని దయతో అది అయినప్పుడే అవుతుందని అన్నారు. అయితే, ఆ సమయం ఇంత త్వరగా వస్తుందని అభిమానులు ఊహించలేకపోయారు.

Priyanka Chopra
Nick Jonas
Surrogacy
Baby

More Telugu News