'సర్కారువారి పాట'కి సంబంధించి అది పుకారేనట!
- షూటింగు దశలో 'సర్కారువారి పాట'
- మోకాలు సర్జరీతో విశ్రాంతిలో ఉన్న మహేశ్
- ఆయన కాంబినేషన్లో లేని సీన్స్ చిత్రీకరణ
- ఏప్రిల్ 1వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో హీరో కాంబినేషన్లో లేని సన్నివేశాలను పరశురామ్ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఇవి రీ షూట్ సీన్స్ అనే ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబుకి సంతృప్తికరంగా అనిపించని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో అలాంటిదేం లేదని, ఇదంతా పుకారేనని ఈ సినిమా యూనిట్ తేల్చేసింది.
ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సీన్స్ అన్నీ కూడా కొత్త షెడ్యూల్ కి సంబంధించినవని చెబుతున్నారు. ఇంతవరకూ ఒక్క సీన్ ను కూడా రీ షూట్ చేయలేదనీ .. ఆ అవసరమేలేదని అంటున్నారు. త్వరలోనే మహేశ్ మళ్లీ జాయిన్ కానున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పినప్పటికీ, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాలి.