Botsa Satyanarayana: మేమొచ్చిన రెండున్నరేళ్లకే రోడ్లన్నీ పాడయ్యాయి.. టీడీపీ అవినీతి అర్థమవుతోంది: ఏపీ మంత్రి బొత్స

Roads laid during TDP tenure damaged in two and half years time says Botsa
  • కొత్త రోడ్డుకు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది
  • ప్రపంచ బ్యాంకు సాయంతో రోడ్లు వేయిస్తాం
  • కాకినాడ శివారు ప్రాంతాలకు నీటి సమస్య తీరుస్తాం
తమ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లకే టీడీపీ హయాంలో వేసిన రోడ్లన్నీ పాడయ్యాయని... దీన్నిబట్టి టీడీపీ పాలనలో ఎంత దోపిడీ, అవినీతి జరిగిందో అర్థమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక కొత్త రోడ్డుకు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కాలపరిమితి ఉంటుందని చెప్పారు.

టీడీపీ వాళ్లు వేసిన రోడ్లు పాడైపోయినప్పటికీ ప్రపంచ బ్యాంకు సాయంతో తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లు వేసేందుకు టెండర్లను ఆహ్వానించామని తెలిపారు. కాకినాడ శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్యను తీరుస్తామని చెప్పారు.

త్వరలో జరిగే కొన్ని మున్సిపల్ ఎన్నికలకు గ్రామాల విలీన సమస్య ఉందని, అయితే వీటిపై కొందరు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. వాటిని వెకేట్ చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
Botsa Satyanarayana
YSRCP
Telugudesam
Roads

More Telugu News