Supreme Court: పోర్న్ చిత్రాల కేసులో పూనమ్ పాండేకు ఊరట

  • బలవంతపు చర్యలకు దిగొద్దన్న సుప్రీంకోర్టు 
  • మహారాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ
  • ఈ కేసులో రాజ్ కుంద్రాకు సైతం లోగడ ఊరట
SC grants protection from arrest to actress Poonam Pandey

పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు తాత్కాలిక రక్షణ లభించింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం అరెస్ట్ నుంచి రక్షణ పొందడం తెలిసిందే. దీంతో తనకు సైతం అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పూనమ్ పాండే బాంబే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది.

దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర సర్కారుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ (పాండే)కు వ్యతిరేకంగా ఎటువంటి బలవంతపు చర్యలకు దిగొద్దని సర్కారును ఆదేశించింది.

కాగా, లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను పంపిణీ చేస్తున్నారంటూ వివిధ సెక్షన్ల కింద ముంబై సైబర్ సెల్ పోలీసులు రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో షెర్లిన్ చోప్రాతోపాటు పాండే పేరును కూడా పోలీసులు చేర్చారు. దీంతో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు.

More Telugu News