Ram Gopal Varma: అల్లు అర్జున్​ ‘ఒమెగా’ అవుతాడు.. మెగా ఫ్యామిలీపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

Ramgopal Varma Says Allu Arjun Becomes Omega
  • అల్లు అర్జున్ బంధువులుగానే మెగా కుటుంబ సభ్యులు తెలుస్తారు
  • మెగా ఫ్యామిలీలో మెగా అల్లు అర్జునే
  • అల్లు అరవింద్ మెగా ప్రౌడ్ గా ఉండాలి
  • బన్నీకి మెగా ఫ్యామిలీతో డైరెక్ట్ రక్త సంబంధం లేదంటూ వ్యాఖ్య
ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆడిపోసుకునే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద పడ్డారు. చిరంజీవి కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో మెగా కుటుంబ సభ్యులందరూ.. భారత్ లో ఏ మూలకు వెళ్లినా అల్లు అర్జున్ బంధువులుగానే తెలుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


మెగా కుటుంబంతో డైరెక్ట్ గా రక్త సంబంధం లేకపోయినప్పటికీ... ఆ మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒక్కడే మెగా అని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో ‘ఒమెగా’ అవుతాడంటూ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ ఆధునిక తరం రజనీకాంత్ అంటూ కొనియాడారు. సహజ సిద్ధంగా ఉండే విశ్వాసం, బయటకు కనిపించే తీరు రజనీకాంత్ ను చిరంజీవి లాంటి ఇతర కుటుంబాలతో పోలిస్తే పదిరెట్లు ఎత్తులో ఉంటారన్నారు. కాబట్టి అతడి సృష్టి పట్ల అల్లు అరవింద్ మెగా ప్రౌడ్ గా ఉండాలంటూ ట్వీట్ చేశారు.

అయితే, కాసేపటికే ‘అల్లు అర్జున్ బంధువులు’ అనే ఒక్క ట్వీట్ ను మాత్రమే ఉంచిన వర్మ.. మిగతా రెండు ట్వీట్లను మాత్రం తొలగించేశారు.

Ram Gopal Varma
RGV
Mega Family
Allu Arjun
Chiranjeevi
Allu Arvind

More Telugu News