Lata Mangeshkar: వృద్ధాప్యం కారణంగా లతా మంగేష్కర్ త్వరగా కోలుకోలేకపోతున్నారు: బ్రీచ్ కాండీ ఆసుపత్రి డాక్టర్

Lata Mangeshkar still in ICU
  • కరోనా బారినపడిన గానకోకిల
  • ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స
  • ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్ 
  • లతా వయసు 92 సంవత్సరాలు

గానకోకిల లతా మంగేష్కర్ కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో లతాకు చికిత్స చేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రతీత్ సందానీ తెలిపారు.

లతా మంగేష్కర్ వృద్ధాప్యం కారణంగా త్వరగా కోలుకోలేకపోతున్నారని, ఆమె ఆరోగ్యవంతురాలు కావడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. లతా మంగేష్కర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News