Liquor Sales: మందుబాబులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు

AP Govt extends liquor sales time one more hour
  • ఇటీవలే రేట్ల తగ్గింపు
  • అందుబాటులోకి పలు రకాల బ్రాండ్ల రాక 
  • తాజాగా మరో నిర్ణయం
  • రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు
ఇటీవల మద్యం ధరలు తగ్గించి, విస్తృత స్థాయిలో ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం దుకాణాల పనివేళలను మరో గంట పొడిగించింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు ఇకపై రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే సమయంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Liquor Sales
Time
AP Govt

More Telugu News