Abudabhi: అబుదాభి ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి

Terrorist attack on Abudabhi airport
  • డ్రోన్ ల ద్వారా దాడికి పాల్పడిన వైనం
  • ఎయిర్ పోర్టులోని మూడు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం
  • దాడికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న హౌతీ ఉగ్రవాదులు
యూఏఈ రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయని అధికారులు తెలిపారు.

మరోపక్క, ఈ డ్రోన్ దాడులు తమ పనేనని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్ లో సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై హౌతీ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో గల్ఫ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Abudabhi
Airport
Terrorist Attack

More Telugu News