Omicron: కుటుంబ సభ్యులంతా ఏకకాలంలో కరోనా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు: అపోలో వైద్యుడు డాక్టర్ ఆశిష్ చౌహాన్

Entire Families Omicron hit Within Hours Of Exposure
  • గంటల వ్యవధిలోనే కనిపిస్తున్న లక్షణాలు
  • ఒమిక్రాన్ కేసుల్లో వెలుగు చూస్తున్న అనుభవాలు
  • ఇంట్లోనూ మాస్క్ లు ధరించడం మంచిదంటూ సూచన 
ఒమిక్రాన్ రకం చాలా వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. కానీ, సాధారణ ప్రజానీకం దీన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. వారి నిర్లక్ష్యంతో కుటుంబంలో అందరూ ఏకకాలంలో కరోనా వైరస్ బారిన పడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు.

‘‘సాధారణంగా అయితే ఒకరు గంట వ్యవధిలో ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. లక్షణాలు వృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ, మేము చూస్తున్నది ఏమిటంటే కుటుంబ సభ్యులు అందరిలోనూ ఏక కాలంలో లక్షణాలు బయటపడుతున్నాయి. అంటే వారు ఒకే సమయంలో ఇన్ఫెక్షన్ కు గురి అయినట్టు తెలుస్తోంది’’ అని అపోలో హాస్పిటల్స్ ఫిజీషియన్, కొవిడ్ కేర్ నిపుణుడు డాక్టర్ ఆశిష్ చౌహాన్ పేర్కొన్నారు.

‘‘కుటుంబ సభ్యులు అందరూ కలసి పరీక్ష కోసం వస్తున్నారు. గంటల వ్యవధిలోనే తమకు లక్షణాలు కనిపించినట్టు వారు చెబుతున్నారు. అయితే కొందరిలో లక్షణాలు కనిపించడం లేదు. కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో, మిగతా వారు కూడా వచ్చి పరీక్ష చేయించుకుంటున్నారు’’ అని హైదరాబాద్ లోని ప్రముఖ ప్రభుత్వ కరోనా చికిత్సా కేంద్రం వర్గాలు తెలిపాయి.

ఇంట్లో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు అందరూ మాస్క్ లు ధరించడం మంచిదని డాక్టర్ ఆశిష్ చౌహాన్ సూచించారు. తద్వారా వేగంగా వ్యాపించే గుణం ఉన్న ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించుకోవచ్చన్నారు.
Omicron
Entire Family
symptoms
wear mask
hyderabad

More Telugu News