Ajay Devgn: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న అజయ్ దేవగణ్

Ajay Devgn offers prayers to Sabarimala Ayyappa
  • అయ్యప్ప మాలను ధరించిన బాలీవుడ్ స్టార్
  • నియమనిష్ఠలతో అయ్యప్పను కొలిచిన అజయ్
  • 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్న హీరో 
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న సంగతి తెలిసిందే. మాలను ధరించిన తర్వాత ఆయన ఎంతో నియమనిష్ఠలతో ఉన్నారు. తాజాగా ఆయన శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమలకు వచ్చిన అజయ్... 18 మెట్లు ఎక్కి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

అజయ్ తో పాటు ఆయన బంధువులు విక్రాంత్, ధర్మేంద్ర కూడా శబరిమలకు వెళ్లారు. అజయ్ శబరిమలకు వెళ్లిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రతియేటా ఎంతో మంది సినీ ప్రముఖులు అయ్యప్ప మాల వేసుకుంటుంటారు. చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, వివేక్ ఒబెరాయ్, ధనుష్, శింబు వంటి నటులు ప్రతి సంవత్సరం మాల వేసుకుంటుంటారు.
Ajay Devgn
Bollywood
Ayyappa
Sabarimala

More Telugu News