Corona Virus: దేశంలో క‌రోనా విజృంభ‌ణ‌.. ఒక్క రోజులో 2.71 ల‌క్ష‌ల కేసులు

corona bulletin in inida
  • మొత్తం 7,743 ఒమిక్రాన్ కేసులు
  • రోజువారీ పాజిటివిటీ రేటు 16.28 శాతం
  • మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 3,50,85,721
  • మొత్తం 70.24 కోట్ల క‌రోనా టెస్టులు  
దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజులో 2,71,202 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 7,743 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 16.28 శాతంగా, వార‌పు పాజిటివిటీ రేటు 13.69 శాతంగా ఉంది.

నిన్న క‌రోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 3,50,85,721గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 15,50,377 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. మొత్తం 70.24 కోట్ల క‌రోనా టెస్టులు చేశారని పేర్కొంది. నిన్న‌ 16,65,404 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు వివ‌రించింది.
Corona Virus
COVID19
India

More Telugu News