Union Budget-2022: కేంద్ర బడ్జెట్ కు ముహూర్తం ఖరారు... రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలు

Union Budget will present in Parliament shortly
  • ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ 
  • పార్లమెంటులో 400 మంది సిబ్బందికి కరోనా
  • అప్రమత్తమైన ఓం బిర్లా, వెంకయ్యనాయుడు

కేంద్ర వార్షిక బడ్జెట్ కు సమయం ఆసన్నమైంది. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. జనవరి 31 ఉభయ సభలను ఉద్దేశంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు.

కాగా, బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫ్రిబవరి 11 వరకు... రెండో విడతలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు సభా సమావేశాలు జరుగుతాయి. మార్చి 18న హోలి సందర్భంగా పార్లమెంటు సమావేశాలు జరగవు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.

కాగా, పార్లమెంటులో 400 మంది సిబ్బంది కరోనా సోకడంతో, పార్లమెంటు సమావేశాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సమీక్ష జరిపారు. కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటిస్తూ, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News