Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం 3డీ వీడియో విడుదల చేసిన ట్రస్టు

Theertha Kshetra trust releases Ram Mandir construction video
  • అయోధ్యలో రామమందిర నిర్మాణం
  • 2020 ఆగస్టు 5న భూమిపూజ చేసిన ప్రధాని మోదీ
  • కొనసాగుతున్న నిర్మాణ పనులు
  • 2023 డిసెంబరు నుంచి భక్తులకు అనుమతి
అయోధ్యలో రామ జన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణం వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయంలోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి దారితీసే రోడ్డు మార్గం తదితర అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు.

ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు. ఈ వీడియోను 3డీ యానిమేషన్ విధానంలో రూపొందించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.
Ayodhya Ram Mandir
3D Video
Animation
Theertha Kshetra Trust

More Telugu News