Revanth Reddy: ఛాలెంజ్ లు చేయడం ఆపి.. ఆ హామీని నెరవేర్చండి: కేటీఆర్ ను డిమాండ్ చేసిన రేవంత్

Revanth Reddy demands KTR to supply fertilizers for free to farmers
  • రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు
  • హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోయింది
  • చాలా తేలికగా ఆ హామీని మర్చిపోయారు
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఛాలెంజ్ లు చేయడం, డిబేట్స్ నుంచి పారిపోవడం వంటివి కాకుండా... రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హామీల వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 2017 ఏప్రిల్ 13న రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోయిందని... కానీ చాలా తేలికగా, పూర్తిగా ఆ హామీని మర్చిపోయారని మండిపడ్డారు. రైతుల కోసం ఆ హామీని నెరవేర్చాలని కేటీఆర్ ను డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
Revanth Reddy
Congress
KTR
TRS

More Telugu News