Pinnelli Ramakrishna Reddy: తోట చంద్రయ్య హత్యతో వైసీపీకి సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

MLA Pinnelli Ramakrishna Reddy responds to TDP worker murder
  • గుంటూరు జిల్లా గుండ్లపాడులో టీడీపీ కార్యకర్త హత్య
  • వైసీపీ నేతలే చంపారంటున్న టీడీపీ
  • పిన్నెల్లికి చంద్రబాబు వార్నింగ్
  • హత్యా రాజకీయాలకు దూరమన్న పిన్నెల్లి

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకర్గంలోని గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురికావడం రాజకీయ దుమారం రేపింది. వైసీపీ గూండాలే చంద్రయ్యను హత్య చేశారంటూ టీడీపీ అధినాయకత్వం ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రయ్య హత్య రెండు వర్గాల మధ్య కక్షల వల్ల జరిగిందని తెలిపారు. అంతే తప్ప, ఈ హత్యతో వైసీపీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలకు తాను చాలా దూరంగా ఉంటానని, ఆ దిశగా ఎవరినీ ప్రోత్సహించనని వెల్లడించారు. చంద్రయ్య హత్య నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.

  • Loading...

More Telugu News