Raghunandan Rao: ప్రగతి భవన్ వరకు పాదయాత్రగా వెళతా: బీజేపీ నేత రఘునందన్ రావు

Will go to Prathi Bhavan by padayatra says Raghunandan Rao
  • గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ప్రగతి భవన్ కు పాదయాత్ర చేపడతా
  • గౌరవెల్లి భూనిర్వాసితుల సమస్యలను సీఎంకు విన్నవిస్తా
  • దళితబంధు పథకాన్ని ఎత్తేశారు

ఫిబ్రవరి రెండో వారంలో కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపడతానని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి పాదయాత్ర ద్వారా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ కు నిర్వాసితుల సమస్యలు విన్నవిస్తామని చెప్పారు. గౌరవెల్లి నిర్వాసితులతో ఈరోజు ఆయన మాట్లాడారు.

గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో సీఎంను నిలదీస్తామని తెలిపారు. నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణమని అన్నారు. కేవలం ఓట్ల కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని... హుజూరాబాద్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ పథకాన్ని ఎత్తేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News