Chiranjeevi: మ‌రో గంట‌న్న‌ర‌లో అన్ని అంశాల‌పై క్లారిటీ ఇస్తాన‌న్న చిరంజీవి.. వీడియో ఇదిగో

chiranjeevi meets jagan
  • ఏపీ చేరుకున్న మెగాస్టార్
  • జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ
  • అంత‌కుముందు గన్నవరం విమానాశ్ర‌యం వ‌ద్ద మాట్లాడిన చిరు
  • సీఎంతో అన్ని విషయాలపై చర్చిస్తానంటూ వ్యాఖ్య‌
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను క‌లిసేందుకు మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్ర‌యం వ‌ద్ద‌ ఆయ‌నను మీడియా పలకరించగా.. తాను సీఎం జ‌గ‌న్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాన‌ని చెప్పారు.

సీఎంతో అన్ని విషయాలపై చర్చిస్తాన‌ని చిరంజీవి తెలిపారు. జ‌గ‌న్ తో లంచ్ చేసి, అనంత‌రం చ‌ర్చించి మరో గంటన్నరలో అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తాన‌ని వ్యాఖ్యానించారు. అనంత‌రం ఆయ‌న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జ‌గ‌న్ నివాసం వద్దకు వెళ్లి జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల అంశంపై చ‌ర్చించ‌డానికే జ‌గ‌న్‌తో చిరంజీవి స‌మావేశం అవుతున్న‌ట్లు తెలిసింది.
Chiranjeevi
Tollywood
Andhra Pradesh
Jagan

More Telugu News