Nagarjuna: రొమాన్స్ లోను, యాక్షన్ లోను చేయితిరిగిన 'బంగార్రాజు' .. ట్రైలర్ రిలీజ్! 

Bangarraju Trailer Released
  • 'బంగార్రాజు'గా నాగార్జున
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • సంగీత దర్శకుడిగా అనూప్
  • ఈ నెల 14వ తేదీన విడుదల    
నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కీ .. రొమాన్స్ కి ప్రాధాన్యతనిస్తూ నడిచే కథ ఇది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. ఆ పాత్రల కాంబినేషన్లోని ఇంట్రెస్టింగ్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఒక వైపున స్వర్గంలో అప్సరసల మధ్య నాగ్ అల్లరి .. మరో వైపున గ్రామీణ నేపథ్యంలో చైతూ సందడి .. మరో వైపున కృతి శెట్టి పాత్ర తాలూకు సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

ఇక 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో శివాలయం .. పాము నేపథ్యంలోని విజువల్స్ కూడా ఈ ట్రైలర్ లో చోటుచేసుకున్నాయి. రావు రమేశ్ .. వెన్నెల కిశోర్ .. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, యమధర్మరాజు పాత్రలో నాగబాబు కనిపిస్తున్నాడు.
Nagarjuna
Ramya Krishna
Chaitu
Krithi Shetty
bangarraju Movie

More Telugu News