NCW: సిద్ధార్థ్ కు ఇది కొత్తేమీ కాదు... పదేపదే మహిళలపై అనైతిక వ్యాఖ్యలు చేస్తున్నాడు: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్

NCW Chair Person Rekha Sharma fires on actor Siddharth
  • సైనా నెహ్వాల్ పై వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్
  • జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
  • ఓ మహిళా యాంకర్ పైనా ఇలాగే వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ
  • చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి లేఖ
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ కు ఇది కొత్తేమీ కాదని, పదేపదే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు.

ఇటీవల సిద్ధార్థ్ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ చానల్ యాంకర్ పైనా ఇలాగే వ్యాఖ్యలు చేశాడని విమర్శించారు. మహిళా యాంకర్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అనైతిక వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఈ అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించిందని, సిద్ధార్థ్ పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి లేఖ రాసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా అతడిని నిరోధించాలని కోరినట్టు రేఖా శర్మ తెలిపారు.
NCW
Siddharth
Rekha Sharma
Anchor
Saina Nehwal
India

More Telugu News