USA: అమెరికాపై కరోనా పంజా.. ప్రతి సెకనుకు ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో తెలుసా..?

9 Corona cases registering per second in USA
  • అమెరికాపై పంజా విసురుతున్న కరోనా
  • నిన్న ఒక్క రోజే లక్షలకు పైగా కేసుల నమోదు
  • ప్రతి సెకనుకు నమోదవుతున్న 9 కేసులు
కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. మహమ్మారి ఉగ్రరూపానికి అల్లాడిపోతోంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల సగటును పరిశీలిస్తే, ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో కూడా అమెరికా భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. రాబోయే వారాల్లో అమెరికాను కరోనా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
USA
Corona Virus
Cases
Cases per Second

More Telugu News