Team India: మూడో టెస్ట్ నేడే... టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?

Can Team India creates history in 3 test against South Africa in Cape Town
  • టెస్ట్ సిరీస్ లో 1-1తో సమంగా ఉన్న టీమిండియా, సౌతాఫ్రికా
  • ఈరోజు కేప్ టౌన్ లో ప్రారంభం కానున్న చివరి టెస్ట్
  • చివరి టెస్టులో ఆడుతున్న విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికాతో పర్యటనలో ఉన్న టీమిండియా టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని, చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉంది. మూడు టెస్టుల ఈ సిరీస్ లో భారత్, సౌతాఫ్రికాలు చెరో మ్యాచ్ ను గెలుపొందాయి. దీంతో చివరి టెస్టును గెలుచుకునే జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. కేప్ టౌన్ వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడనుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. గాయం కారణంగా సిరాజ్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాంత్ శర్మ ఆడే అవకాశం ఉంది. మరోవైపు భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టీమిండియా, సౌతాఫ్రికా తుది జట్లు (ప్రాబబుల్స్):
ఇండియా: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ/ఉమేశ్ యాదవ్.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గార్ (కెప్టెన్), మార్ క్రమ్, కీగన్ పీటర్సన్, వాన్ డర్ డుస్సేన్, టెంబా బవుమా, వెర్రెనీ (వికెట్ కీపర్), జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, ఒలీవియర్, ఎన్గిడీ.
Team India
South Africa
3rd Test
Cape Town

More Telugu News