Prabhas: హాలీవుడ్ డైరెక్టర్లు ప్రభాస్ గురించి ఆరా తీస్తున్నారు: అశ్వనీదత్

Producer Aswini Dutt says Hollywood directors insists on Prabhas
  • బాహుబలితో అంతర్జాతీయ క్రేజ్
  • వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్
  • ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అశ్వనీదత్
బాహుబలి చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్... ప్రస్తుతం నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ బాలీవుడ్ లో 'ఆదిపురుష్', కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్-కె' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. క్రమంగా తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ హాలీవుడ్ డైరెక్టర్ల దృష్టిలో పడ్డాడని అన్నారు. ప్రభాస్ గురించి హాలీవుడ్ దర్శకులు ఆరా తీస్తున్నారని, అతడితో సినిమా తీసే అవకాశాలను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. హాలీవుడ్ డైరెక్టర్లను ఇంతలా ఆకర్షిస్తున్న భారతీయ కథానాయకుడు ప్రభాస్ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్ట్-కె చిత్రం తర్వాత ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్ గా మారుతుందనడంలో అతిశయోక్తి లేదని అశ్వనీదత్ పేర్కొన్నారు.

కాగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా, కరోనా విజృంభణతో వాయిదా పడింది. కరోనా పరిస్థితులను గమనించుకుంటూ చిత్ర బృందం మరో తేదీ ప్రకటించనుంది.
Prabhas
Aswini Dutt
Hollywood
Directors
Tollywood
Bollywood

More Telugu News