Sid Sriram: మణిరత్నం దర్శకత్వంలో హీరోగా గాయకుడు సిద్ శ్రీరామ్?

Sid Sriram in Manirathnam Movie
  • 'కడల్' మూవీతో సిద్ శ్రీరామ్ పరిచయం
  • గాయకుడిగా మంచి క్రేజ్
  • తెలుగు .. తమిళ భాషల్లో బిజీ
  • హీరోగా ఎంట్రీ అంటూ టాక్
గాయకులుగా మంచి క్రేజ్ వచ్చిన తరువాత వారు హీరోలుగా మారిన సందర్భాలు కొన్ని కనిపిస్తాయి. తెలుగులో కూడా కొంత మంది సింగర్స్ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారుగానీ .. చాలా తక్కువ. కోలీవుడ్ లో మాత్రం జీవీ ప్రకాశ్ కుమార్ .. హిప్ హాప్ తమిళ వంటి సంగీత దర్శకులు తమ పనిని పక్కన పెట్టకుండానే హీరోలుగాను రాణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు .. తమిళ భాషల్లో పాప్యులర్ సింగర్ అయిన సిద్ శ్రీరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే టాక్ వినిపిస్తోంది .. అదీ మణిరత్నం దర్శకత్వంలో. మణిరత్నం కొంతకాలం క్రితం తెరకెక్కించిన 'కడల్' సినిమాతో సిద్ శ్రీరామ్ గాయకుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమాతో ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ఇప్పుడు అదే మణిరత్నం .. సిద్ శ్రీరామ్ ను హీరోగా పరిచయం చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. కథా చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని చెబుతున్నారు.  
Sid Sriram
Manirathnam
Kollywood

More Telugu News