Anand Mahindra: మహీంద్రా కార్లు తప్ప వేరే కార్లు డ్రైవ్ చేయరా? అనే ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాధానం

Does Anand Mahindra Drive Cars Other Than Mahindra here is his answer
  • మహీంద్రా కాకుండా వేరే కార్లు ఉన్నాయని చెపుతున్నారా? అన్న ఆనంద్ మహీంద్రా
  • నాకు ఐడియా లేదే అంటూ చమత్కారం
  • ఏదో సరదాకి అంటున్నానని వ్యాఖ్య
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమొబైల్స్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నెటిజెన్లు అడిగే ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో చమత్కారంతో కూడిన సమాధానాలను ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆయనకు ఓ నెటిజెన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

'సార్, మహీంద్రా కార్లు తప్ప ఇతర కార్లను మీరు డ్రైవ్ చేయరా?' అని నెటిజెన్ ప్రశ్నించగా... ' అంటే... మహీంద్రా కాకుండా వేరే కార్లు కూడా ఉన్నాయని చెపుతున్నారా? నాకు ఐడియా లేదే' అని సమాధానమిచ్చారు. అలాగే, ఊరికే ఏదో సరదాగా అంటున్నానంటూ స్మైలీ ఎమోజీని పెట్టారు. ఆయన చమత్కారానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు
Anand Mahindra
Mahindra Car

More Telugu News