ఇది మామిడి స్పెషల్ వైన్.. యూపీలో తయారీ
- దశేరి పండ్లతో ఎక్సైజ్ శాఖ ప్రయోగం
- ద్రాక్ష పండ్లు లేకపోవడమే కారణం
- ప్రభుత్వం అనుమతిస్తే యూనిట్ల ఏర్పాటు
విరివిగా లభించే మామిడి, ఇతర పండ్లతో అక్కడ వైన్ తయారీ చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఇక మామిడి వైన్ పొంగి పొర్లుతుంది. పెద్ద ఎత్తున మామిడి వైన్ తయారీకి యూనిట్లను ఏర్పాటు చేయాలన్నది ఎక్సైజ్ శాఖ ఆలోచన. స్థానికంగా పండే ప్రముఖ మామిడి రకం దశేరి పండ్లను వైన్ తయారీకి వినియోగించాలన్నది ఎక్సైజ్ శాఖ ప్రణాళిక. మామిడి వైన్ వినియోగం ఎప్పటి నుంచో ఉంది. యూపీలో మాత్రం ఇదే మొదటిసారి.