Team India: నిర్ణయాత్మక మూడో టెస్టు కోసం టీమిండియా కఠోర సాధన... ఫొటోలు ఇవిగో!

Team India cricketers practice session at Newlands in Capetown
  • ఈ నెల 11 నుంచి మూడో టెస్టు
  • కేప్ టౌన్ లో మ్యాచ్
  • సిరీస్ లో చెరో టెస్టు గెలిచిన టీమిండియా, దక్షిణాఫ్రికా
  • కేప్ టౌన్ చేరుకున్న భారత ఆటగాళ్లు
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితం తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యమిస్తోంది. ఈ సిరీస్ లో సెంచురియన్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ 1-1తో సమం చేసింది. దాంతో ఇప్పుడందరి దృష్టి మూడో టెస్టుపై పడింది.

ఎల్లుండి నుంచి జరిగే ఈ టెస్టు కోసం భారత్ ఇప్పటికే కేప్ టౌన్ చేరుకుంది. ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో ఆటగాళ్లు సాధన షురూ చేశారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో కసరత్తులు, నెట్ ప్రాక్టీసు చేశారు. కాగా, వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తూ కనిపించడం శుభపరిణామం అని చెప్పాలి.
Team India
Practice
Newlands
Third Test
South Africa
Cape Town
Virat Kohli

More Telugu News