pm: ‘కొవిడ్’పై ప్రధాని నేడు ఉన్నత స్థాయి సమీక్ష

PM To Hold Meeting On Covid Situation
  • సాయంత్రం 4.30 గంటలకు సమావేశం
  • హాజరుకానున్న ఉన్నతాధికారులు
  • కీలక సూచనలకు అవకాశం
ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఉన్నతాధికారులతో కరోనా మహమ్మారిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. గడిచిన వారం రోజుల్లో కరోనా కేసులు 20వేల నుంచి 1.6 లక్షలకు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రధాని సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రధాని చివరిగా గతేడాది డిసెంబర్ 24న కరోనాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండడం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తో కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ప్రధాని మోదీ అధికారులకు పటిష్ట కార్యాచరణను నిర్ధేశించనున్నారు. రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉంది.
pm
prime minister
Covid Situation
review

More Telugu News