Kurnool District: యడ్లపాడు పోలీసుల అదుపులో కరుడుగట్టిన పాణ్యం గ్యాంగ్ రేప్ ముఠా

Edlapadu police arrested Panyam gang Rape gang
  • కర్నూలు జిల్లా పాణ్యం ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
  • కూలి పనుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ దోపిడీలు, అత్యాచారాలు
  • గుంటూరు జిల్లాలో 30కి పైగా అత్యాచారాలు, దారి దోపిడీలు
కూలి పనుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ అత్యాచారాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన ముఠాను గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లాలో మకాం వేసిన ఈ ముఠా సభ్యులు వరుసగా దారి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లికి చెందిన ఓ జంటపై దాడిచేసిన ముఠా.. భర్తపై దాడిచేసి అతడి ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది.

అలాగే, యడ్లపాడు పరిధిలో రెండు జంటలపై దాడిచేసి దోపిడీకి పాల్పడింది. మరో ఘటనలో ద్విచక్ర వాహనంపై తల్లితో కలిసి వస్తున్న యువకుడిని అడ్డగించిన ముఠా సభ్యులు అతడిని తీవ్రంగా కొట్టి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. వేలి ముద్రల ఆధారంగా ముఠా సభ్యులను కర్నూలు జిల్లా పాణ్యం ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు కూలి పనుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుంటారని పోలీసులు తెలిపారు. జిల్లాలో 30కి పైగా అత్యాచారాలు, దారి దోపిడీలకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు.
Kurnool District
Panyam
Gang Rape
Guntur District
Edlapadu

More Telugu News