Pinarayi Vijayan: హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కేరళ ముఖ్యమంత్రి విజయన్ భేటీ

Kerala CM Pinarayi Vijayan met Telangana CM KCR at Pragathi Bhavan
  • హైదరాబాదులో సీపీఎం సమావేశాలు
  • నగరానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్
  • విజయన్ ను లంచ్ కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్
  • విజయన్ వెంట సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ విచ్చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు నగరంలోనే జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం విజయన్ కూడా పాల్గొంటున్నారు. కాగా, నగరానికి వచ్చిన కేరళ సీఎంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ను పినరయి విజయన్ ప్రగతి భవన్ లో కలిశారు. కాగా, విజయన్ వెంట సీతారాం ఏచూరి (సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి), సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ కూడా ఉన్నారు.
Pinarayi Vijayan
CM KCR
Pragathi Bhavan
Hyderabad
CPM
Telangana
Kerala

More Telugu News