Vijayasai Reddy: నిన్నెవరూ లవ్ చేయరు చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి

Chandrababu nobody will love you says Vijayasai Reddy
  • రాజకీయ పార్టీని లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు
  • వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అని బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు
  • నిన్ను లవ్ చేసేది పచ్చకుల మీడియానే
జనసేనతో పొత్తు గురించి ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పొత్తు గురించి మాట్లాడుతూ లవ్ అనేది రెండు వైపులా ఉండాలని... వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదని అన్నారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని అన్నారు. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తరి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచి జనం లవ్ చేయరు బాబూ అని అన్నారు. నిన్ను లవ్ చేసేది పచ్చ కుల మీడియా, నీ బినామీలే అని చెప్పారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News