meme: నిన్న 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల కాక‌పోవ‌డంపై క‌డుపుబ్బా న‌వ్విస్తోన్న‌ మీమ్స్ ఇవి..!

rrr movie release postpones memes

  • రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'
  • నిన్న విడుద‌ల కావాల్సిన సినిమా
  • క‌రోనా కార‌ణంగా వాయిదా
  • విడుద‌ల నాటికి హీరోలు వృద్ధులు అవుతార‌ని మీమ్స్‌

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల అనుకున్న స‌మయానికి జ‌రిగితే ఈ రోజు దేశం మొత్తం ఆ సినిమా నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిపోయేద‌ని నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ‌ని చెప్పిన ఆర్ఆర్ఆర్ నిర్మాత‌లు చివ‌ర‌కు దాన్ని వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ సినిమా నిన్న విడుద‌ల కాలేక‌పోయింది.  
                               

సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ఆశ‌గా ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశ‌ను ఎవ‌రితో చెప్పుకోవాలో కూడా అర్థం కాక‌ సామాజిక మాధ్య‌మాల్లో మీమ్స్ రూపంలో త‌మ క్రియేటివిటీతో అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

'ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల అయ్యేలోపు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వృద్ధులు అయిపోతారంటూ కొందరు సృష్టించిన పోస్టులు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. 50 ఏళ్ల త‌ర్వాత విడుద‌ల చేసే సినిమా షూటింగ్‌ను ఇప్పుడే తీసి పెట్టుకోవ‌డం ఎందుకంటూ నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంత‌కు ముందు బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న టెన్ష‌న్ ను ప్రేక్ష‌కుల్లో ఉంచి చంపేసిన రాజ‌మౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుద‌ల ఎప్పుడ‌న్న టెన్ష‌న్లో ఉంచాడ‌ని చుర‌క‌లంటిస్తున్నారు.
 
        

              

             

  • Loading...

More Telugu News